Donations to Telangana Government to Fight against Corona Virus.
Karimnagar Granite traders gave Rs 75 Lakh cash and Rs one crore worth medicines, medical equipment as donation. Of this, Karimnagar Granite Quarry Owners’ Association gave Rs 50 Lakh.Cheque for Rs 50 Lakh is given by Quarry Owners’ Association Representatives Sri Ponnamneni Gangadhar Rao, President Sri Sridhar to the CM.
Marwari Granite Factories Association gave Rs 25 Lakh Cheque to the CM. Association representatives Sri Gopi Maheswari, Sri Rajesh Agarwal, Sri Mukesh Parwal gave the Cheque to the CM.

తెలంగాణ లో సీఎం సహాయ నిధికి విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా యూనిక్ ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షల విరాళం ఇచ్చింది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామడుగు రామ్ దేవ్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో, రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి గౌరవ కె టి ఆర్ కి సంబంధిత చెక్కును సోమవారం ప్రగతి భవన్ లో అందించారు. ఈ సందర్భంగా కె టి ఆర్ రామడుగు రామ్ దేవ్ రావు ని అభినందించారు.
హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రూ.2కోట్ల చెక్కుల విరాళాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. ఖమ్మం నియోజకవర్గం లో దాతల నుండి రూ.1.75 కోట్లు, మమత వైద్య విద్య సంస్ధల నుండి రూ. 25 లక్షలను జోడించి రూ.2 కోట్ల మొత్తం సి.ఎం సహాయ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభినందించారు… చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా కట్టడికై చేపట్టిన సహాయ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు పలువురు దాతలు పెద్ద మనసుతో ముందుకొస్తున్నారు.ఖమ్మం నుండి వివిధ రంగాల వ్యాపారులు, విద్యా, వైద్య సంస్థలు, వర్తక వ్యాపారులు, కాంట్రాక్టర్లు ముందుకొచ్చి రూ.1.75 మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి అందజేశారు. ఈ క్రమంలోనే మమత వైద్య విద్య సంస్థ ఛైర్మన్, రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పువ్వాడ గారు కూడా భారీ మొత్తంలో రూ.25 ప్రకటించారు.కోవిడ్ -19 మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వవల్సిందిగా సిఎం చేసిన అభ్యర్ధనకు స్పందించి మంత్రి తన నియోజకవర్గమైన ఖమ్మంలో భారీ స్థాయిలో విరాళాలు పోగు చేశారు.సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్ లో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ఆ మొత్తాన్ని అందజేయగా మంత్రిని సి.ఎం కేసీఆర్ గారు అభినందించారు. ఖమ్మం జిల్లాలో కరోనా నియంత్రణకై చేపట్టిన చర్యలను మంత్రి సిఎంకు వివరించారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, కరోనా నివారణ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం మరింతగా పునరంకితం అవుతూ తోటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.ఇలాంటి ఎన్నో విపత్కర సవాళ్లు ఎదురైనప్పుడు దాతలు అండగా నిలిచారని గుర్తు చేశారు.కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం జరిపే పోరాటానికి అండగా నిలవడంలో దాతల సహాయం ఎంతో తోడ్పడగలదన్నారు.సిఎం పిలుపుతో తాను చేసిన విన్నపం మేరకు ఖమ్మం జిల్లాలో ముందుకొచ్చి విరాళాలను అందించిన దాతలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు.
ఈ బృహత్కార్యంలో పలువురు భాగస్వాములై తమవంతు సహాయం అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి మార్గ నిర్ధేశాలతో కరోనా నియంత్రణకై డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు తెలంగాణ సమాజం మొత్తం హాట్సప్ చెబుతోందన్నారు.ప్రబలిన కోవిడ్ -19 వంటి ప్రజారోగ్య సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, ఇలాంటి మహమ్మారిని కట్టడి చేయడానికి సమష్టి కృషి అవసరమన్నారు.ప్రజలు స్వీయ నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతూ కరోనాని అరికట్టడంలో అందరం భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.